హైదరాబాద్: 28°C
తెలంగాణ

చికిత్స పొందుతూ రైతు మృతి

MLG: వెంకటాపూర్ మండల కేంద్రానికి చెందిన రైతు మండల లింగయ్య (55) చికిత్స పొందుతూ మృతి చెందారు. సెప్టెంబర్ 17న పత్తి చేనులో గడ్డి మందు పిచికారీ చేసిన అనంతరం అస్వస్థతకు గురయ్యారు. హనుమకొండ, హైదరాబాద్, వరంగల్‌లో చికిత్స పొందారు. బుధవారం ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. భార్య జెన్నక్క ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై చల్ల రాజు తెలిపారు.