హైదరాబాద్: 28°C
తెలంగాణ

జర్నలిస్టుల హక్కుల కోసం అక్టోబర్ 2న నిరసన

MLG: జర్నలిస్టుల హక్కుల సాధన, సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్ 2 (రేపు) ములుగులోని మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట నిరసన చేపట్టనున్నట్లు టీయూడబ్ల్యూజే(IJU) జిల్లా అధ్యక్షుడు షఫీ అహ్మద్ తెలిపారు. మీడియా సిబ్బందికి ప్రత్యేక రక్షణ చట్టం, నూతన వేజ్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.