హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొమురవెల్లి మల్లన్నస్వామికి విశేష అభిషేకాలు

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో గురువారం సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్లన్న స్వామివారికి అర్చకులు శాస్త్రోక్తంగా విశేష అభిషేకాలు, దివ్యాలంకరణ జరిపారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవడానికి తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయ ఆవరణమంతా ఓం నమఃశివాయ స్మరణతో మార్మోగింది.