హైదరాబాద్: 28°C
వ్యాపారం

బిగ్ షాక్.. పెరిగిన సిలిండర్ ధరలు

దసరా పండుగ సీజన్ సమీపిస్తున్న తరుణంలో వ్యాపారులకు, సామాన్యులకు బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.62.50 పెరిగి రూ.2,837.50కి చేరింది. అంతకుముందు సెప్టెంబర్ ప్రారంభంలో కూడా ఢిల్లీలో ఈ సిలిండర్ ధర రూ.9.50 మేర పెరిగిన విషయం తెలిసిందే. వరుసగా రెండో నెల కూడా కమర్షియల్ గ్యాస్ ధర పెరగడంతో హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర చిరు వ్యాపారులపై అదనపు భారం పడనుంది.