హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి'

WNP: రేవల్లి మండలంలోని రైతులందరూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని వ్యవసాయ అధికారి ఎం. మణిచందర్ సూచించారు. రేవల్లి, నాగపూర్, తల్పునూర్ క్లస్టర్లలో 1,570 మంది రైతులు ఇంకా నమోదు చేసుకోలేదన్నారు. రైతులు ఆధార్, పట్టాదారు పాస్‌బుక్, లింక్ అయిన మొబైల్ నంబర్‌తో ఏఈఓ లేదా మీ సేవ, సీఎస్సీ కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని కోరారు.