హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాస్థాయి పోటీల్లో సత్తా చాటిన PMశ్రీ పాఠశాల విద్యార్థులు

JGL: జగిత్యాల పట్టణంలో బుధవారం నిర్వహించిన పీఎం శ్రీ ప్రభుత్వ పాఠశాలల జిల్లా స్థాయి క్విజ్ పోటీలో కథలాపూర్ మండలం పోతారం పీఎం శ్రీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ప్రథమ స్థానం దక్కించుకున్నారు. బీర్పూర్ పీఎం శ్రీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ద్వితీయ స్థానంలో నిలిచారు. విజేతలకు డీఈవో రాము ప్రశంసా పత్రాలు అందించి అభినందించారు.