హైదరాబాద్: 28°C
తెలంగాణ

మిర్జాపల్లి స్టేషన్‌లో రైలు ప్రమాదం

మెదక్: మిర్జాపల్లి రైల్వే స్టేషన్ ఆవరణలో బుధవారం మధ్యాహ్నం విషాదం చోటుచేసుకుంది. పట్టాలు దాటుతున్న సమయంలో దేవగిరి ఎక్స్‌ప్రెస్ ఢీకొని నర్ర సత్యనారాయణ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు శాలిపేట గ్రామానికి చెందినవాడిగా స్థానికులు గుర్తించారు. కామారెడ్డి రైల్వే పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.