హైదరాబాద్: 28°C
తెలంగాణ

2B బార్‌కు దరఖాస్తులు ఆహ్వానం

JN: స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఒక 2B బార్ ఏర్పాటుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారి ఎన్.అంజిరెడ్డి తెలిపారు. దరఖాస్తు రుసుము రూ.లక్ష కాగా, అక్టోబర్ 12 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అక్టోబర్ 16న ఉదయం 11 గంటలకు లాటరీ ద్వారా ఎంపిక నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.