PDPL: పార్కులు, రోడ్లు, ఇతర ఖాళీ ప్రదేశాలలో మద్యం, గంజాయి సేవిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ధర్మారం ఎస్సై శ్రీకాంత్ హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాలలో సేవించడం చట్టవిరుద్దమని తెలిపారు. మద్యం సేవించి వాహనాల నడపకూడదని సూచించారు. బహిరంగ ప్రదేశాలలో గంజాయి, మద్యం సేవించే లేదా విక్రయించే వారి సమాచారం పోలీసులకు అందించాలని ప్రజలను కోరారు.
తెలంగాణ
బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే కఠిన చర్యలు


