హైదరాబాద్: 28°C
వ్యాపారం

వాట్సాప్‌లో మరిన్ని పేరెంట్ కంట్రోల్స్‌

వాట్సాప్ మరిన్ని పేరెంటల్ కంట్రోల్స్‌ను తీసుకొచ్చింది. దీంతో పిల్లలు ఎవరితో చాట్ చేయాలో.. ఏ వాట్సాప్ గ్రూప్‌ల్లో జాయిన్ కావాలో పేరెంట్సే నిర్ణయించొచ్చు. అలాగే, టీనేజర్లు ఉన్న గ్రూప్‌ల్లో ఎక్కువ మంది చేరుతున్నా గార్డియన్స్‌కు నోటిఫికేషన్ వెళ్తుంది. పిల్లల ప్రొఫైల్ ఎవరు చూడాలి? స్టేటస్ అప్‌డేట్స్ ఎవరికి వెళ్లాలో కూడా గార్డియనే ఇకపై నిర్ణయించొచ్చు.