హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

VSP: అనారోగ్యంతో బాధపడుతున్న 24 మంది బాధితులకు రూ.13.55 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు బుధవారం అందజేశారు. ఎంవీపీ కాలనీ క్యాంప్ కార్యాలయంలో ఆనందపురం, పద్మనాభం, పలు వార్డుల లబ్ధిదారులకు ఈ సహాయం అందించారు. ఆపదలో ఉన్న పేదలకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా గంటా పేర్కొన్నారు.