హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

​బ్రాహ్మణపల్లిలో ‘పల్లె పండుగ 3.0’ పనులు

PLD: కూటమి ప్రభుత్వ సారథ్యంలో 'పల్లె పండుగ 3.0' పనులు ఊపందుకున్నాయి. గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లిలో సీసీ రోడ్ల నిర్మాణానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, ఆర్డీవో మురళీకృష్ణ భూమిపూజ చేశారు. నాణ్యమైన రోడ్లు, గ్రామాల సమగ్ర అభివృద్ధే లక్ష్యమని వారు స్పష్టం చేశారు.