హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కాంప్లెక్స్‌లను నిరుద్యోగులకు కేటాయించాలి'

ASR: పెదలబుడు పంచాయతీ నిధులతో నిర్మించిన 9 షాపింగ్ కాంప్లెక్స్‌లను స్థానిక ఆదివాసీ నిరుద్యోగులకు కేటాయించాలని ఆదివాసీ జేఏసీ డిమాండ్ చేసింది. బహిరంగ ప్రకటన ద్వారా దరఖాస్తులు స్వీకరించి, పారదర్శక లాటరీ విధానంలో కేటాయించాలని కోరారు. ఈ మేరకు ఎస్టీ కమిషన్ సభ్యుడు కిల్లో సాయిరామ్, ఎంపీడీవో, డిప్యూటీ తహసీల్దార్, పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రాలు అందజేశారు.