హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కుప్పకూలిన 'ఇరుముడి' మూవీ బ్రిడ్జ్

ASR: చింతూరు మండలం పొల్లూరులో 'ఇరుముడి' సినిమా షూటింగ్ కోసం ప్రత్యేకంగా నిర్మించిన ఐకానిక్ సెట్టింగ్ బ్రిడ్జ్ కొండవాగుల వరద ఉధృతికి పూర్తిగా కొట్టుకుపోయింది. భారీ వర్షాలతో పొల్లూరు జలపాతం ఉగ్రరూపం దాల్చడంతో ఈ ప్రమాదం జరిగింది. సినిమా హిట్ అయ్యాక పర్యాటక ప్రాంతంగా మారిన ఈ బ్రిడ్జ్ కూలిపోవడంతో పర్యాటకులు నిరాశ చెందుతున్నారు.