హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉచిత కంటి వైద్య శిబిరం

VSP: ఫైజర్ హెల్త్‌కేర్, శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అగనంపూడిలో రెండు రోజుల ఉచిత కంటి వైద్య శిబిరం ప్రారంభమైంది. ఫైజర్ సైట్ హెడ్ రవి చంద్ర కట్టా ప్రారంభించిన ఈ శిబిరంలో తొలిరోజే 500 మందికి ఉచితంగా కంటి పరీక్షలు చేసి కళ్లద్దాలు పంపిణీ చేశారు. రెండో రోజు కూడా ఈ శిబిరం కొనసాగుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని నిర్వాహకులు కోరారు.