హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి ప్రాధాన్యం

GNTR: అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్రకుమార్ తెలిపారు. పొన్నూరు నియోజకవర్గంలో నూతనంగా ఎంపికైన అంగన్వాడీ టీచర్లకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా 2,926 మంది చిన్నారులకు పాఠ్యపుస్తకాలు, ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేశారు. 482 మంది అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు దుస్తులు అందించారు.