హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్మికుల సంక్షేమ బోర్డు కోసం ధర్నా

PLD: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులోని అన్ని పథకాలను అమలు చేసి, పెండింగ్‌ క్లెయిమ్‌లకు వెంటనే నిధులు విడుదల చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సిలార్ మసూద్ డిమాండ్ చేశారు. బుధవారం ఏసీఎల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. 2019కు ముందు అమలైన 14 సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని, ప్రమాద మరణానికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలన్నారు.