PPM: కురుపాం మండలం భలుకోటలోని ఎంపీపీ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను సబ్ కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల హాజరు, బోధనా ప్రమాణాలు, మౌలిక వసతులను పరిశీలించారు. అంగన్వాడీలో పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారం, రికార్డులను తనిఖీ చేసి గర్భిణులు, బాలింతలకు అందుతున్న సేవలపై ఆరా తీశారు.
ఆంధ్రప్రదేశ్
భలుకోటలో సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ


