హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లింగ నిర్ధారణ పరీక్షలపై JC సీరియస్ వార్నింగ్

కోనసీమ: లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని JC వైఖోమ్ నైదియాదేవి ఆదేశించారు. బుధవారం అమలాపురం కలెక్టరేట్‌లో మాతా శిశు మరణాల కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కానింగ్ కేంద్రాలపై నిఘా ఉంచాలన్నారు. ఫారమ్-ఎఫ్, గర్భిణుల వివరాలు, రికార్డులు తనిఖీ చేయాలని సూచించారు.