హైదరాబాద్: 28°C
తెలంగాణ

అనుమతుల్లేని నిరసనలపై నిషేధం: SP

SRD: శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం జిల్లావ్యాప్తంగా అక్టోబర్ 1 నుండి 31వ తేదీ వరకు 30, 30(ఏ) పోలీస్ యాక్ట్-1861 అమల్లో ఉంటుందని ఎస్పీ పరితోష్ పంకజ్ స్పష్టం చేశారు. ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు, నిరసనలు, బహిరంగ సభలు నిర్వహిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు పోలీసులకు సహకరించాలని కోరారు.