హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుళ్లిన స్థితిలో మహిళ మృతదేహం లభ్యం

HYD: మెహదీపట్నంలో మహిళ మృతదేహం తీవ్ర కలకలం రేపింది. హబీబ్‌నగర్ చారఖందిల్ చౌరస్తా సమీపంలో కుళ్లిపోయిన స్థితిలో మహిళ మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు, క్లూస్ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. మహిళ మృతికి గల కారణాలపై హబీబ్‌నగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.