హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: బాలికల ఆరోగ్య రక్షణకు టీకా రక్ష

AKP: రోలుగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం 14 ఏళ్లు నిండిన బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ శ్రావణి మాట్లాడుతూ.. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు ఈ టీకా ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. బహిరంగ మార్కెట్లో రూ.16 వేల వరకు ఉండే ఈ టీకాను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.