హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రియదర్శికి హరీశ్‌రావు అభినందనలు

SDPT: ప్యారడైజ్ సినిమాలో మాజీ సీఎం కేసీఆర్ పాత్రను ప్రదర్శించిన తీరుపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో నటుడు ప్రియదర్శిని ఎమ్మెల్యే హరీశ్‌రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతాలక్ష్మారెడ్డి ప్రత్యేకంగా కలసి అభినందనలు తెలిపారు. కేసీఆర్ శైలిని, ఆంగికాన్ని సహజ సిద్ధంగా తెరపై పండించి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారని వారు కొనియాడారు.