హైదరాబాద్: 28°C
క్రీడలు

బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న క్యాంప్‌బెల్

టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో వెస్టిండీస్ బ్యాటర్లు టీ20 తరహాలో ఆడుతున్నారు. దీంతో ఆ జట్టు స్కోరు 11 ఓవర్లలోనే ఒక వికెట్ నష్టానికి 104 పరుగులు చేసింది. ఓపెనర్ జాన్ క్యాంప్‌బెల్ 44 బంతుల్లోనే 78 పరుగులతో దూకుడుగా ఆడుతున్నాడు. మరో ఓపెనర్ కీసీ కార్టీ 9 పరుగులకే ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో అవుటయ్యాడు. హోప్ 15 పరుగులతో క్యాంప్‌బెల్‌కు సహకారం అందిస్తున్నాడు.