VZM: సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మి పెరిగిన ధరలకు అనుగుణంగా పారిశుధ్య కార్మికుల జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని గజపతినగరం, పురిటిపెంట పంచాయతీ కార్యాలయాల్లో అందజేశారు. 2024లో పెంచిన స్వల్ప జీతం ప్రస్తుతం ఆకాశాన్నంటుతున్న నిత్యావసర ధరలకు సరిపోవడం లేదని, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
'పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలి'


