హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మార్టూరులో హీరో నాని సందడి

BPT: సినీ హీరో నాని బుధవారం బాపట్ల జిల్లా మార్టూరులోని పరుచూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు క్యాంపు కార్యాలయాన్ని సందర్శించారు. ఇటీవల 'ప్యారడైజ్' సినిమా విడుదలైన నేపథ్యంలో నాని రాకతో అభిమానులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. తమ అభిమాన నటుడిని చూసేందుకు వచ్చిన జనంతో కార్యాలయం వద్ద కోలాహలం నెలకొంది. అనంతరం ఎమ్మెల్యే ఏలూరితో నాని ప్రత్యేకంగా సమావేశమయ్యారు.