హైదరాబాద్: 28°C
తెలంగాణ

ZPHSలో అదనపు కలెక్టర్ తనిఖీ

MBNR: భూత్పూర్ జడ్పీహెచ్‌ఎస్ ఉన్నత పాఠశాలను స్థానిక సంస్థల అ. కలెక్టర్ మధుసూదన్ నాయక్ బుధవారం తనిఖీ చేశారు. పాఠశాలలో కొనసాగుతున్న పారిశుధ్య చర్యలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో నేరుగా మాట్లాడి పాఠశాలలోని మౌలిక వసతులు, బోధన తీరుపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాన్ని ఎంచుకుని దానిని సాధించే దిశగా ముందుకు సాగాలని సూచించారు.