హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైష్ణవ శ్రీనివాసులకు స్వర్ణ నంది అవార్డు

సత్యసాయి: ధర్మవరం పట్టణానికి చెందిన సీనియర్ పాత్రికేయులు వైష్ణవ శ్రీనివాసులకు హైదరాబాద్ మేఘా ఫౌండేషన్ స్వర్ణ నంది అవార్డు అందజేసింది. పాత్రికేయ రంగంలో సుదీర్ఘకాలంగా సేవలందిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసినందుకు ఈ పురస్కారం లభించింది. పాత్రికేయులు ఆయనను శాలువా, తలపాగాతో ఘనంగా సత్కరించారు.