హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

12వ వార్డులో పర్యటించిన గజ్జల సుధీర్

PLD: సత్తెనపల్లి 12వ వార్డులో ఈరోజు ఉదయం వైసీపీ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి పర్యటించారు. స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. యువతలో ఉత్సాహం నింపుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కష్టపడే కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ సహారా మౌలాలి తదితరులు పాల్గొన్నారు.