హైదరాబాద్: 28°C
తెలంగాణ

సాంకేతిక లోపంతో రైళ్ల నిలిపివేత

GDWL: గద్వాల రైల్వేస్టేషన్‌‌లో సిగ్నల్‌ వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తడంతో బుధవారం రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సిగ్నల్స్‌ పనిచేయక పలు రైళ్లు స్టేషన్‌‌లో నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైళ్లు ఎప్పుడు కదులుతాయో తెలియక ఆందోళనకు గురయ్యారు. రైల్వే సిబ్బంది సిగ్నల్‌ వ్యవస్థ పునరుద్ధరణ పనులు చేపట్టారు.