హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘మేడారం వచ్చే భక్తులకు బస్సులు నడపాలి’

MLG: భూపాలపల్లి నుంచి మేడారం మీదుగా ఏటూరునాగారం, బయ్యక్కపేట, నార్లపూర్‌లకు ఆర్టీసీ బస్సులు నడపాలని సమ్మక్క-సారలమ్మ కోయదొరల పూజార్ల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన లక్ష్మణరావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. మేడారం వచ్చే భక్తులకు సరైన రవాణా సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్నారని వాపోయారు. ఆర్టీసీ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.