హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

కాకినాడ రూరల్ మండలం తమ్మవరం గ్రామంలో లయన్స్ ఇంటర్నేషనల్, లయన్స్ క్లబ్ కాకినాడ మనం ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్యఅతిథిగా హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తున్న లయన్స్ క్లబ్ నిర్వాహకులు, వైద్య బృందాన్ని ఎమ్మెల్యే అభినందించారు.