అనంతపురం జిల్లాలో కాసేపట్లో వర్షాలు కురువనున్నాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 3 గంటల్లో జిల్లాలో పలుచోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఆంధ్రప్రదేశ్
మరో మూడు గంటల్లో జిల్లాలో భారీ వర్షం


