హైదరాబాద్: 28°C
తెలంగాణ

చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపాలి: గండ్ర

BHPL: పట్టణంలో రోడ్డు విస్తరణలో భాగంగా చిరు వ్యాపారుల దుకాణాలు తొలగించే ముందు ప్రత్యామ్నాయ స్థలాలు కల్పించాలని మాజీ MLA గండ్ర వెంకటరమణారెడ్డి కోరారు. పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లలో నివసిస్తున్న పేద కుటుంబాలను ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. పేదల జీవనోపాధిని కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు.