హైదరాబాద్: 28°C
తెలంగాణ

రిమ్స్ అగ్నిప్రమాద బాధితులకు ప్రభుత్వ సాయం

ADB: రిమ్స్ ఆసుపత్రి అగ్నిప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంది. బజార్‌హత్నూర్ మండలం శ్యామ్‌రావుగూడకు చెందిన బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున ప్రకటించిన రూ.5 లక్షల చెక్కును.. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య బుధవారం స్వయంగా అందజేశారు. ప్రభుత్వం బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.