హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కడపాయపల్లె ఎస్సీ కాలనీలో అపరిశుభ్రత

KDP: సిద్ధవటం మండలంలోని కడపాయపల్లె ఎస్సీ కాలనీలో పారిశుద్ధ్యం లోపించడంతో దుర్వాసన వెదజల్లుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. రహదారుల వెంట చెత్త పేరుకుపోయినా తొలగింపు చర్యలు చేపట్టలేదన్నారు. రాత్రివేళ విద్యుత్ దీపాలు వెలగక విషపురుగులు సంచరిస్తున్నాయని తెలిపారు. అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు.