హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైలు ప్రమాదంలో మృతి చెందిన గొర్రెలకు బీమా

BHNG: మెట్ట సమీపంలో రైలు ప్రమాదంలో మృతి చెందిన సుమారు 400 గొర్రెలకు ఇన్సూరెన్స్ వర్తింపజేసి బాధిత కాపరి బాలబోయిన కిష్టయ్యను ప్రభుత్వం ఆదుకోవాలని గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు దయ్యాల నరసింహ డిమాండ్ చేశారు. ప్రమాదంలో రూ.50 లక్షల నష్టం వాటిల్లిందని తెలిపారు.