హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోతులకు అరటిపండ్లు అందించిన ఎమ్మెల్యే

అన్నమయ్య: రాయచోటి ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న వైసీపీ జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి కొండల్లోని కోతులకు అరటిపండ్లు అందజేశారు. మూగజీవుల పట్ల ప్రేమ, దయ, కరుణతో వ్యవహరించాలనే సందేశాన్ని ఈ సందర్భంగా చాటిచెప్పారు. ఎమ్మెల్యే చూపిన ఆప్యాయత పలువురి ప్రశంసలు అందుకుంది.