GDWL: మానవపాడు మండలం ఏ.బూడిదపాడు గ్రామంలో బుధవారం పౌర హక్కుల దినోత్సవ సదస్సు నిర్వహించారు. తహసీల్దార్ మన్సూర్ అలీ, SI నాగశేఖర్ రెడ్డి, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ప్రభావతి పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలపై వివక్ష చూపితే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. మహిళలకు సముచిత గౌరవం ఇస్తూ అందరూ సామరస్యంగా జీవించాలని సూచించారు.
తెలంగాణ
పౌర హక్కుల అవగాహన సదస్సు


