హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈటల సమక్షంలో బీజేపీలో చేరిక

MDL: మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ నివాసంలో అల్వాల్ మండలం తుర్కపల్లి డివిజన్ అధ్యక్షుడు మంద విజయ్ ఆధ్వర్యంలో పలువురు బీజేపీలో చేరారు. ప్రధాని మోదీ నాయకత్వంలోనే దేశాభివృద్ధి సాధ్యమని వారు పేర్కొన్నారు. ఈటల రాజేందర్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు డీ.గిరివర్ధన్ రెడ్డి, నేత మాణిక్య రెడ్డి ఇందులో పాల్గొన్నారు.