హైదరాబాద్: 28°C
తెలంగాణ

11 గ్రామాల్లో పోలీసుల నిరంతర నిఘా

SRPT : గంజాయి వినియోగం, సైబర్‌ నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. యువత గంజాయి వినియోగానికి దూరంగా ఉండేలా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. హుజూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని 11 గ్రామాలకు విలేజ్‌ పోలీసింగ్‌ అధికారులను నియమించి, ఆయా ప్రాంతాల్లో నిరంతరం నిఘా కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.