NGKL: ఉప్పునుంతల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి, ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.70 వేల నష్టపరిహారం అందించాలని సీపీఎం మండల కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. బుధవారం కంసానిపల్లిలో సీపీఎం కరువు బృందం ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడింది. వర్షాలు లేక పంటలు పూర్తిగా ఎండిపోయాయని, పెట్టుబడులు తిరిగిరాని పరిస్థితి నెలకొందని తెలిపారు.
తెలంగాణ
'కరువు మండలంగా ప్రకటించాలి'


