శ్రీకాకుళం మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. ఈ మేరకు నగరపాలక సంస్థ వద్ద బుధవారం ధర్నా చేపట్టారు. మూడేళ్లుగా వేతనాలు పెరగలేదని, డీఏ, పీఆర్సీ అమలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు అమ్మన్నాయుడు అన్నారు. మృతి చెందిన, రిటైర్డ్ కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం, గ్రాట్యూటీ, హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచాలి'


