హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్థలం కేటాయించాలని ఆందోళన

MBNR: హిందూ శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలని కోరుతూ విశ్వహిందూ పరిషత్ సభ్యులు జడ్చర్ల MRO ఆఫీస్ ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేసి సమస్యను పరిష్కరించాలని కోరారు. హిందూ శ్మశాన వాటిక కోసం స్థలం కేటాయించాలని అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇందులో జగ్పాల్ రెడ్డి, VHP అధ్యక్షుడు ముచ్చర్ల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.