హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆయిల్ ఫ్యాక్టరీ కోసం స్ధల పరిశీలన

NZB:  జిల్లాలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటైతే స్థానిక రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి అన్నారు. నందిపేటలోని లక్కంపల్లి సెజ్‌ను ఆనుకుని ఉన్న ప్రాంతాన్ని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, కలెక్టర్ భవేష్ మిశ్రాతో కలిసి ఆయన పరిశీలించారు. ఫ్యాక్టరీ ఏర్పాటుకు గుర్తించిన స్థలం అనుకూలతపై అధికారులతో చర్చించారు.