హైదరాబాద్: 28°C
తెలంగాణ

బస్సుల కోసం విద్యార్థుల రాస్తారోకో

NZB: బస్సుల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులు ఆర్టీసీ బస్సును అడ్డుకుని నిరసన తెలిపారు. బోధన్ నియోజకవర్గంలోని సాలూరు మండలం ఖాజాపూర్ గ్రామం వద్ద బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. సుంకిని నుంచి సాలూరు మీదుగా వెళ్లే బస్సులు సరిపడా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు తెలిపారు. బస్సు ముందు కూర్చొని నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.