W.G: నరసాపురం అదనపు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) ఎస్.రాజ్యలక్ష్మి బుధవారం స్థానిక ఉప కారాగారాన్ని తనిఖీ చేశారు. ఖైదీల ఆరోగ్యం, వైద్య సేవలు, ఆహార నాణ్యతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవసరమైన ఖైదీలు మండల న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న ఉచిత న్యాయ సహాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు. క్షణికావేశం, ధనాపేక్షతో నేరాలకు పాల్పడవద్దని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక ఉప కారాగారంలో తనిఖీలు


