హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నరసరావుపేట మీదుగా కర్నూలుకు కొత్త రైలు సర్వీస్

PLD: మచిలీపట్నం–కర్నూలు సిటీ మధ్య నరసరావుపేట మీదుగా కొత్త రైలు సర్వీసు ప్రవేశపెట్టేందుకు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు లేఖ ద్వారా వెల్లడించారు. ఈ రైలు సర్వీసుతో నరసరావుపేటతో పాటు మార్గమధ్యంలోని ప్రాంతాల ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం కలగనుంది.