హైదరాబాద్: 28°C
తెలంగాణ

సర్పంచ్ సురేష్ రెడ్డికి చిన్నారెడ్డి నివాళులు

WNP: కొత్తకోట మండలం విలియంకొండ సర్పంచ్ సురేష్ రెడ్డి పార్థివ దేహానికి మాజీ మంత్రి డాక్టర్ చిన్నారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. వనపర్తి నియోజకవర్గ తొలి ఎమ్మెల్యే సురవరం ప్రతాపరెడ్డి మనవడైన సురేష్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరమన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి, మనోధైర్యం కలగాలని ప్రార్థించారు. శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నరు.