హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాత్రివేళల్లో విస్తృతంగా పోలీసుల తనిఖీలు

కర్నూలు జిల్లాలో నేరాల నియంత్రణ, ప్రజల భద్రతే లక్ష్యంగా రాత్రివేళల్లో విజిబుల్ పోలీసింగ్‌ చేపడుతున్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. కర్నూలు, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆదోని సబ్‌డివిజన్లలో అనుమానాస్పద వాహనాలు, వ్యక్తులను తనిఖీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ‘స్టాప్, వాష్ అండ్ గో’ కార్యక్రమంపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు.